ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

మహబూబాబాద్ పరిసర ప్రాంతాలలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది.

Update: 2023-04-21 09:03 GMT
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
  • whatsapp icon

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ పరిసర ప్రాంతాలలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. 8 మంది ముఠా సభ్యులలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 మొబైల్ ఫోన్లు, రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్, మహబూబాబాద్ టౌన్ పోలీసు గత కొన్ని రోజులుగా క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు.

శుక్రవారం రోజున నమ్మదగిన సమాచారంతో చట్టవిరుద్ధంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వ్యక్తులపై మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు మహబూబాబాద్ టౌన్ పోలీసు వారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ముఠాను అరెస్ట్ చేశారు. ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. అమాయక పేద, మధ్య తరగతుల ప్రజలను బెట్టింగ్ రూపంలో దోపిడీ చేస్తున్న వారిపై పిడి యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న మహబూబాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ బి సంతోష్ సిహెచ్ రమేష్ పిసిలు కోటేశ్వరరావు, రామకృష్ణ, దిలీప్, వీరస్వామి, ఎండి షఫీ, ఐటీ కోర్ స్టాఫ్ సుమన్, నాగరాజు‌లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డు అందజేశారు. 

Tags:    

Similar News