పెండింగ్ బిల్లుల ఎఫెక్ట్!.. సచివాలయానికి ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం

సెక్రటేరియట్ లో ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-07-16 08:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలగాణ సెక్రటేరియట్‌కు ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల సేవలు నిలిచిపోయాయి. అయితే బిల్లులు బకాయిలు ఉండటంతో  నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తున్నది. నిపుణ నెట్ వర్క్‌కు రూ.కోట్లలో బకాయిలు ఉన్నట్లు తెలుస్తున్నది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. దీంతో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇంటర్ నెట్ బంద్ చేసినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోజే ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటం హాట్ టాపిక్‌గా మారింది.


Similar News