Bhatti Vikramarka : మా ప్రభుత్వానికి మీకు ఉన్న తేడా ఇదే! గురుకులాలపై భట్టి ఆసక్తికర ట్వీట్

మా ప్రభుత్వానికి మీకు ఉన్న తేడా ఇదేనంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-09-01 08:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మా ప్రభుత్వానికి మీకు ఉన్న తేడా ఇదేనంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం పదే పదే రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి చెబుతున్నారు.. 5 లక్షల మంది చదువుకునే విద్యార్థులు ఉన్నా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3 కోట్లు కేటాయిస్తే, మా ప్రభుత్వం 5వేల కోట్లను రెసిడెన్షియల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించిందని తెలిపారు.

దాదాపు 4 నుంచి 5 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నారని అరకొర ఏర్పాట్లు చేశారని, ఈ క్రమంలోనే కరీంగనర్‌లో ఓ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించినప్పుడు వసతులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుతున్న ప్రతి బిడ్డకు బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనే ఆలోచనతో మీరు సంవత్సరానికి రూ. 3 కోట్లు నిధులు కేటాయిస్తే.. మేము ఏడాదికి రూ. 5 వేల కోట్లు రెసిడెన్షియల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడతామని, ఇది మా నిబద్ధతకు నిదర్శనం అని చెప్పారు.


Similar News