సీపీఐకి ఒక్క ఎంపీ సీటైనా కాంగ్రెస్ కేటాయించాల్సిందే: కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు
సీపీఐ పార్టీకి మిత్ర ధర్మంగా ఒక ఎంపీ సీటైనా కాంగ్రెస్ కేటాయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సీపీఐ పార్టీకి మిత్ర ధర్మంగా ఒక ఎంపీ సీటైనా కాంగ్రెస్ కేటాయించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మిత్ర ధర్మంగా కొన్ని స్థానాలు అడిగినట్లు గుర్తుచేశారు. ఇటీవల 5 స్థానాలు అడిగామని, అయితే తాము అడిగిన వాటిలో నల్గొండ టికెట్ ఆల్రెడీ వేరే వారికి ప్రకటించారని, కాబట్టి తాము అడిగిన నాలుగు సీట్లలో ఒకటి ఇవ్వాలన్నారు.
బీఎస్పీ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఏ ప్రాతిపదికన బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుపెట్టుకున్నారో ప్రజలకు చెప్పాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని పెద్ద అని కొనియాడారు. కానీ మోడీ మాత్రం సభలో స్థాయికి మించి మాట్లాడారని మండిపడ్డారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు దెబ్బతింటుందని, కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎంపీ ఎన్నికల లోపే జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.