ఇండియా టుడే సర్వే : 2018లో ఏం తేల్చిందంటే..?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేలనున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేలనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో పాటు పలు సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. కాగా, ఇండియా టుడే సంస్థ ఈ సారి కాంగ్రెస్ 63-73, బీఆర్ఎస్ 34-44 సీట్లు వస్తాయని తేల్చింది. బీజేపీకి 4-8, ఇతరులు 5-8 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది.
ఇక 2018లో ఈ సంస్థ బీఆర్ఎస్కు 79-91 సీట్లు వస్తాయని తెలపగా బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు 21-33 సీట్లు వస్తాయని చెప్పగా 21 స్థానాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్‌లో లాస్ట్ టర్మ్‌లో చెప్పిన లెక్కలు కరెక్ట్ కావడంతో ఈ సారి ఓటరు నాడి ఈ సంస్థకు చిక్కిందా..? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.