హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0 లో చేర్చండి : కేంద్రానికి సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0(Amruth 2.0) లో చేర్చాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. దాదాపు 7,444 కిమీల మేర రూ.17 వేల కోట్లతో సీఎస్ఎంపీకి రూపొందించిన డీపీఆర్ ను మనోహర్ లాల్ కు సమర్పించారు. ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా గుర్తించి నిధులు అందివ్వాలని సీఎం కోరారు. హైదరాబాద్ లో సరైన మురుగునీటి శుద్ధీకరణకు రూ.4 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామని, దానికి కూడా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి విన్నవించారు. అలాగే మెట్రో రెండో దశ(Metro 2nd Phase) పనులకు అనుమతులు ఇవ్వాలని ఓ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ కారిడార్ల నిర్మాణ అంచనా వ్యయం రూ. 24,269 లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని కోరారు. దీనిపై త్వరలోనే డీపీఆర్‌ను సమర్పిస్తామని చెప్పారు.