INC: కాంగ్రెస్‌ను కూల్చుడు నీ అయ్య తరం కాదు.. బీజేపీ నేతపై మెట్టు సాయికుమార్ ఫైర్
కాంగ్రెస్ పార్టీని కూల్చుడు మీ అయ్య తరం కాదని, గాంధీ భవన్(Gandhi Bhavan) గేటు కూడా తాకలేరని తెలంగాణ ఫిషరీష్ డెవలెప్‌మెంట్ చైర్మన్ మెట్టు సాయికుమార్(Mettu Saikumar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీని కూల్చుడు మీ అయ్య తరం కాదని, గాంధీ భవన్(Gandhi Bhavan) గేటు కూడా తాకలేరని తెలంగాణ ఫిషరీష్ డెవలెప్‌మెంట్ చైర్మన్ మెట్టు సాయికుమార్(Mettu Saikumar) అన్నారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ నేతల(BJP Leaders)పై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలను గౌరవించని బీజేపీ నేతలకు భరత మాత పేరు కూడా పలికే హక్కు లేదన్నారు. బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) విధానం(Policy) ఒక్కటేనని, మహిళలను చులకనగా చూడటం తప్ప.. గౌరవించడం తెలియదని ఆరోపించారు. జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని కించపరచడం అంటే.. మహిళా సమాజాన్ని అవమాన పరచడమేనని వ్యాఖ్యానించారు. దీనికి శాంతి యుతంగా నిరసన తెలుపుతుంటే బీజేపీ ఆఫీస్(BJP Offie) నుంచి ఆయుధాలు బయటికి వచ్చాయని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు అందరికీ ఉంటుందని, కానీ బీజేపీ రౌడీ రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో మారణాయుధాలు ఎలా ఉంటాయని, బీజేపీ ఆఫీస్ ను తనిఖీ చేసి, సీజ్ చేయాలని సెంట్రల్ జోన్ డీసీపీని(Central Jone DCP) డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ను కూలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) అంటున్నారని, కాంగ్రెస్ పార్టీని కూల్చడం మీ అయ్య తరం కాదని, ఇలాంటి చిన్న చిన్న కుక్కలు చాలా వచ్చాయని, ఇంతవరకు గాంధీ భవన్ గేటు కూడా తాకలేక పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక రాజాసింగ్(Rajasingh) లాంటి పిచ్చి కుక్కలను ఎలా తరమాలో మాకు తెలుసని, పేల్చుడు, కూల్చుడు పక్కనపెడితే.. గాంధీభవన్ ఇటుకను ముట్టుకోలేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ పార్టీ భయపడదని, నోరు అదుపులో పెట్టుకోవాలని, మీ నోటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనే పదం వస్తే.. హైదరాబాద్‌లో తిరగనివ్వమని సాయి కుమార్ హెచ్చరించారు.