భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. ములుగు ఏజెన్సీని జల్లెడ పడుతున్న పోలీసులు!

ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Update: 2024-09-06 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గురువారం(సెప్టెంబర్ 5) జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. తెలంగాణ ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో గల అడవులలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ములుగు జిల్లాలోని మండలాలైన తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు లలోకి రాకపోకలు సాగించే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇంకెవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.కాగా నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ మూలంగా.. పోలీసుల తనిఖీలతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు.

అయితే, గురువారం(సెప్టెంబర్ 5) రోజు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో గల రఘునాథ పాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెల్సిందే.


Similar News