TS : SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ఎస్ఐ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అక్టోబర్‌లో ట్రైనింగ్ ఇవ్వనుందంట.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇప్పటికే ఎస్ఐ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అక్టోబర్‌లో ట్రైనింగ్ ఇవ్వనుందంట. మొత్తం 28 కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ నెల చివర్లో లేదా, సెప్టెంబర్ మొదటి వారంలో కానిస్టేబుల్ ఫలితాలు వెలువరించనుందంట. అన్ని సక్రమంగా జరిగితే అక్టోబర్ 1 నుంచి శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సరిపడా మైదానాలు లేకపోవడంతో TSSPకి సెలెక్ట్ అయిన వారికి రెండో విడతలో ట్రైనింగ్ ఉంటుంది.