వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు: పేర్ని నాని

టీడీపీ, జనసేన నేతలు కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

Update: 2024-08-03 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 175 స్థానలకు గాను కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలిచిన వైసీపీ పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో వారు చేసిన అరాచకాలు అక్రమాలపై తాము చర్యలు తీసుకుంటున్నామని అధికార మంత్రులు నేతలు చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలపై కక్ష పెట్టుకునే టీడీపీ, జనసేన నేతలు కావాలనే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అధికార బలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టిన.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని, అక్రమ ఇసుక, లేఔట్ల పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు.


Similar News