Harish Rao : సంభల్ సందర్శన మీ హక్కు అయితే లగచర్లలో అడ్డగింత ఎందుకూ ? : హరీష్ రావు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao )ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రం సంధించారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao )ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రం సంధించారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా అల్లర్లు జరిగిన యూపీలోని సంభల్ ప్రాంతాన్ని సందర్శించడం మీ హక్కు అయితే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా మా మధుసూధనాచారిని తెలంగాణలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్లకు వెళ్లకుండా ఎందుకు అరెస్టు చేసిందంటూ నిలదీశారు. అవును రాహుల్ జీ..మీరు చెప్పింది నిజమేనని, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో రాజ్యాంగ విలువలకు స్థానం లేదని..ఇదో భారీ హిపోక్రసీ! సిగ్గు అంటూ ఎద్దేవా చేశారు.
హరీష్ రావు తన పోస్టుకు రాహుల్ గాంధీని సంభల్ వెళ్లకుండా అడ్డుకున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను జతచేశారు. కాగా సంభల్ వెళ్లేందుకు బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అనుమతి లేదంటూ ఘాజీపూర్ లో వారి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో వారు రెండు గంటల పాటు వేచి చూసి ఢిల్లీకి తిరిగి వెళ్లారు.
Also Read..
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం.. హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్