మోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఎన్నికలే ఉండవు.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా గెలిస్తే ఈ దేశంలో ఎన్నికలే ఉండకుండా చేస్తారని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-08 07:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా గెలిస్తే ఈ దేశంలో ఎన్నికలే ఉండకుండా చేస్తారని అప్పుడు దేశం మొత్తం బీజేపీ నాయకుల ఆధీనంలోకి వెళ్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నిక్లలో తమ పదేళ్ల పాలన వైఫల్యాలను చర్చకు రాకుండా బీజేపీ దేవుళ్లను ముందుకు పెడుతున్నారని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఎన్నికల్లో మా టార్గెట్ ఎన్డీయే కూటమి అని.. ఓట్ల కోసం దేశంలో మతాల మధ్య మోడీ ఎందుకు చిచ్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ దేశంలో 25 కోట్ల జనాభా ఉన్న ముస్లింలలో అనేక మంది దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని, అనేక మంది ముస్లింలు ఆర్మీలో ఉండి దేశం కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారన్నారు. ఓట్ల కోసం, అధికారం కోసం ఎందుకు వారిని ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. 25 కోట్ల మంది ప్రజలు రోడ్లమీదకు వస్తే ఏం జరుగుతో తెలుసా? అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. తెలంగాణలో తమ టార్గెట్ 15 సీట్లు అని కనీసం 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఎంత పెద్ద శిక్ష విధించిన తప్పులేదన్నారు. కాళేశ్వరం నుంచి లిక్కర్ వరకు అన్నింటిలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ బందువులలో ఎవరూ రూ.15 కోట్లకు తక్కువ లేరని ఆరోపించారు. సంతోష్ రావు బినామీల పేరుతో టానిక్ వైన్ షాప్ పెట్టి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..