నాకు సీఎం నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

గ్రూప్‌-1 అభ్యర్థులు తమకు మద్దతుగా నిలవాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ శుక్రవారం కలిశారు.

Update: 2024-10-19 10:36 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్‌-1 అభ్యర్థులు తమకు మద్దతుగా నిలవాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ శుక్రవారం కలిశారు. అనంతరం పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేసి దారుణంగా కొట్టారని.. పలు వీడియోలు, ఫోటోలను చూపించారు. దీంతో కేంద్ర మంత్రి బండి.. పోలీసుల తీరును ఖండించారు. అలాగే శనివారం హైదరాబాద్ చేరుకున్న ఆయన గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా అశోక్ నగర్ లో నిరసనకు దిగారు. అనంతరం సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. జీవో 29ను రద్దు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేస్తూ.. నిరుద్యోగులతో కలిసి ముందుకు సాగారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశాడని, జీవో 29 పై చర్చకు రావాలని, ఆందోళన విరమించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బండి సంజయ్ స్పందించారు. తనకు సీఎం నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని.. బండి క్లారిటీ ఇచ్చారు. అనంతరం.. ప్రభుత్వం రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలచుకుందా..? ప్రభుత్వం మొండిపట్టు వీడాలని కోరారు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వైపు ర్యాలీగా వెళుతున్న బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద.. అదుపులోకి తీసుకొని నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన గ్రూప్-1 అభ్యర్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గందరగోళం వాతావరణం నెలకొంది.


Similar News