ఇంత పెద్ద ఐటీ దాడులు నేనెప్పుడు చూడలేదు: Minister Mallareddy
భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు చేయిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి,మేడ్చల్ /బోయిన్ పల్లి : భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు చేయిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మమ్మల్నే కాదు.. మా కేసీఆర్‌ను కూడా ఏమీ చేయలేరని మంత్రి స్పష్టంచేశారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం బోయిన్ పల్లిలోని తన నివాసం వద్ద మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. నా పేరు ప్రతిష్టలు డామేజ్ చేసేందుకు ఐటీ దాడులు చేయించారని మండి పడ్డారు. నేను పాలు, పూలు అమ్మిన, బోరు బావులు వేసినా.. చిట్ ఫంఢ్‌లు నడిపినా.. విద్యా సంస్థలను నెలకొల్పినా.. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నానని వెల్లడించారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో సీట్లన్నీ ఆన్‌లైన్ లో పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా డోనేషన్లే లేనప్పుడు రూ.100 కోట్లు ఎక్కడ వసూలు చేస్తామని ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే ఐటీ రెయిడ్ లుండవు.. బీజేపీలో లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నారని మండి పడ్డారు.
నేను చాలా సింపుల్..
ఇంత పెద్ద మొత్తంలో ఐటీ దాడులు తానేప్పుడు చూడలేదన్నారు. దాదాపు 400 మంది ఐటీ అధికారులు 65 బృందాలతో కుటుంబ సభ్యులు, ప్రిన్సిపాల్స్, క్లర్కుల మీద రెయిడ్ చేశారన్నారు. భయబ్రాంతులకు గురి చేశారని తెలిపారు. తాను చాలా సింపుల్ మనిషినని, తన సంస్థలన్ని తెరిచిన పుస్తకాలే అన్నారు. తనది హై థింకింగ్.. లో ప్రొఫైల్ అని వెల్లడించారు. ఐటీ, ఈడీ దాడులు చేస్తారని మా సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు పన్నిన సీఎం కేసీఆర్ తమకు అండగా ఉంటారన్నారు.
33 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాను.. విద్యా సంస్థలు నడుపుతున్నా.. మధ్య తరగతి వారికి ఇంజనీరింగ్ విద్యను అందుబాటులో తీసుకువచ్చానన్నారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ధరకు స్కాలర్‌షిప్ వస్తుందన్నారు. ఏంబీఏ రూ.35 వేల ఫీజుకే అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులకు మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించానన్నారు. పెద్ద ఎత్తున విద్యను మధ్యతరగతికి విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. 20 ఏళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించానన్నారు. నా తమ్ముడు, అల్లుడుతో కలిసి ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్నానన్నారు. 20 వేల కౌన్సిలింగ్ సీట్లు భర్తీ అవుతున్నాయన్నారు. నేనేమి అక్రమాలు, దౌర్జన్యం చేయలేదన్నారు.
అంతా కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తున్నామన్నారు. మా కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు మానసికంగా ఇబ్బందికి గురి చేశానన్నారు. రెండు రోజుల నుంచి ఐటీ అధికారులు భయబ్రాంతులకు గురి చేశారు. పీహెచ్‌డీ చదివిన ప్రిన్సిపాళ్ల ఇళ్లలో రెయిడ్ చేసి, కార్లలో ఎక్కించుకొని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అంతా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. మేనేజ్‌మెంట్ కోటానే లేదన్నారు. డొనేషన్లు లేనప్పుడు రూ.100 కోట్లు ఏలా వస్తాయని ప్రశ్నించారు. తన ఇంట్లో రూ.28 లక్షల మాత్రమే ఐటీ అధికారులకు దొరికాయన్నారు. మల్లారెడ్డి నీవు యూనివర్శిటీ పెట్టు.. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు పెట్టు అని కేసీఆర్ చేప్పారన్నారు. కేవలం రూ. లక్ష ఫీజు చెల్లించి యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 1994లో ఒకసారి, 2008లో రెండోసారి ఇప్పుడు మొత్తం మూడు సార్లు తనపై ఆదాయపు పన్ను దాడులు జరిగినట్లు మంత్రి వెల్లడించారు.
Read More: బోయిన్‌పల్లి పీఎస్‌లో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు