తూచ్.. నేను అలా అనలేదు.. 'Kristu' వ్యాఖ్యలపై హెల్త్ డైరెక్టర్ క్లారిటీ

తాను మతాలను, వ్యక్తుల నమ్మకాలను కించపరిచే వ్యక్తిని కాదని, అన్ని మతాలను ఒకే రకంగా చూస్తానని హెల్త్​ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Update: 2022-12-21 16:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తాను మతాలను, వ్యక్తుల నమ్మకాలను కించపరిచే వ్యక్తిని కాదని, అన్ని మతాలను ఒకే రకంగా చూస్తానని హెల్త్​ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సర్వమతాల సారం ఒక్కటే అని బలంగా నమ్ముతానన్నారు. కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో డీహెచ్​చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం రేగడంతో ఆయన ప్రెస్​నోట్​ రిలీజ్​చేశారు. కొన్ని మీడియా సంస్థలు తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి, వివాదాన్ని సృష్టించడం నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. కేవలం క్రీస్తు ద్వారానే కరోనా సమసిపోయిందని తాను అన్నట్టు అర్థం వచ్చేలా తన వీడియో క్లిప్ కట్ చేసి ప్లే చేయడం బాధకరమన్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఫుల్ వీడియో చూస్తే తాను మాట్లాడిన విషయాలు స్పష్టంగా ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్​ఆదేశాలతో ఆరోగ్య శాఖలోని పై స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల సంపూర్ణ సహకారంతో పాటు అన్ని మతాలకు చెందిన వారు దేవతామూర్తులను ప్రార్థించటం వలనే కరోనా సమసిపోయిందని మాత్రమే తాను మాట్లాడినట్లు డీహెచ్​క్లారిటీ ఇచ్చారు.

READ MORE : టీడీపీలో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News