తెలంగాణలో హ్యూందాయ్ మెగా కారు టెస్టింగ్ సెంటర్

దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ఆటోమోబైల్ హ్యూందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

Update: 2024-08-12 15:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ఆటోమోబైల్ హ్యూందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. తెలంగాణలో మెగా కారు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. దీనిలో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతోపాటు, ఎలక్ట్రికల్ వాహనాలు, అత్యాధునిక టెస్ట్ కార్ల సదుపాయాలు ఉండేలా హ్యూందాయ్ ప్లాన్ చేస్తోంది. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్ మార్క్ ఉత్పత్తులు, సాంకేతిక అభివృద్ది దిశగా పెట్టుబడులు పెడతామని, అందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్న తమ ఇంజనీరింగ్ కేంద్రాన్ని విస్తరిస్తామని హ్యూందాయ్ ప్రతినిధులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సులువైన అనుమతుల వ్యవస్థ ఉండటం వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యుత్తమ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు యువతకు లభిస్తాయన్నారు.  


Similar News