హైడ్రా దూకుడు.. బీజేపీ కార్పొరేటర్ షెడ్లు కూల్చివేత

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) సంచలనంగా మారింది.

Update: 2024-08-31 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ హైడ్రాను తీసుకురాగా నెల రోజుల వ్యవధిలోనే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. చెరువులు, కుంటలను కబ్జా చేసిన నిర్మాణాలు చేపట్టింది ఎంతటి వారైన సరే వదిలిపెట్టకుండా బుల్డోజర్లతో నిర్మాణాలకు కూల్చి వేస్తుంది. ఈ క్రమంలో మైలార్‌దేవులపల్లి కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి(బీజేపీ) షెడ్లను శనివారం హైడ్రా అధికారులు కూల్చి వేశారు. కాగా నాలుగు సంవత్సరాల క్రితం ఈ షెడ్ లో నీరు వచ్చి చేరకుండా చెరువుకు గండి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ షెడ్ల వల్ల అప్పచెరువు దిగువ ప్రాంతం ముంపునకు గురవుతుందని అధికారులు తేల్చడంతో హైడ్రా కూల్చివేతలు జరిపింది.


Similar News