ఓయూ భూములపైనా హైడ్రా ఫోకస్ చేయాలి : క్రైస్తవ జన సమితి సంఘం డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలను కూల్చడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-08-25 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలను కూల్చడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా కబ్జాకు గురయ్యాయని, వాటిపైనా హైడ్రా ఫోకస్ పెట్టి వర్సిటీ భూములు తిరిగి అప్పగించాలని క్రైస్తవ జన సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం హైడ్రా కమిషనర్ కు లేఖ రాశారు. డీడీ కాలనీ, హబ్సిగూడ, తార్నాక, మాణికేశ్వర్ నగర్ ప్రాంతాల్లో ఓయూ భూములు కబ్జా అయ్యాయని ఆయన పేర్కొన్నారు. వీటిపై హైడ్రా తగు చర్యలు తీసుకుని వర్సిటీ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.


Similar News