Sagar Canal: సాగర్ కాలువకు మరోసారి గండి.. నీటి సరఫరా నిలిపివేత

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా (Khammam District)లోని కూసుమంచి మండల పరిధిలోని పాలేరు (Paleru) వద్ద సాగర్ కాల్వ (Sagar Canal)కు భారీ గండి పడింది.

Update: 2024-09-22 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా (Khammam District)లోని కూసుమంచి మండల పరిధిలోని పాలేరు (Paleru) వద్ద సాగర్ కాల్వ (Sagar Canal)కు భారీ గండి పడింది. అయితే, అప్పటికప్పుడు యుద్ధప్రతిపదికన అధికారులు రూ.కోట్లు వెచ్చించి ఆ గండిని పూడ్చి వేయించారు. అయితే, తాజాగా శనివారం సాయంత్రం నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar) నుంచి నీళ్లను అధికారులు విడుదల చేయగా.. ఇది వరకు సాగర్ కాలువ (Sagar Canal)ను పూడ్చిన చోటే మరోసారి గండి పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గండి పూడ్చి నెల కూడా గడవకపోవడం, అదే చోట మళ్లీ గండి పడడం పట్ల స్థానికులు, రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గండి పూడ్చిన కాంట్రాక్టర్ (contractor), సంబంధిత అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News