మేడ్చల్ జిల్లాలో భారీ చోరీ.. రూ.2 కోట్ల నగదు, 28 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

జిల్లాల్లో భారీ చోరీ జరిగిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-22 08:07 GMT

దిశ, ఘట్‌కేసర్: జిల్లాల్లో భారీ చోరీ జరిగిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విరాల్లోకి వెళితే.. కొర్రెముల మక్తకు చెందిన బైనగారి నాగభూషణం (76)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరూ విదేశాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల నాగభూషణం శంకర్‌పల్లిలోని తనకు చెందిన భూమిని అమ్మకానికి పెట్టగా అందుకు సంబంధించి అడ్వాన్స్ నగద రూ.కోటి ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. అయితే, ఆదివారం తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో ఇంటి తలుపులకు బయట నుంచి బేడం పెట్టేసి రోజు లాగే నారపల్లిలోని ఫాంహౌస్‌కు పాలు తీసుకురావడానికి వెళ్లాడు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో రూ. రెండు కోట్ల నగదు, డ్రెస్సింగ్ టేబుల్‌లో ఉన్న 28 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు.

అయితే, చోరీ జరిగిందనే విషయాన్ని గుర్తించిన నాగభూషణం భార్య పద్మ (60) భర్త తెలపగా.. ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను తీసుకొచ్చి ఆధారాలను సేకరించారు. శంకర్‌పల్లి‌లో భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఎంత.. కొనుగోలు చేసిన వారెవరు..? ఎంత అడ్వాన్స్ ఇచ్చారన్న పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీ‌ని పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ చక్రపాణి తెలిపారు. తెలిసిన వ్యక్తులే రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Similar News