HYDRA: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. 1350 ఇళ్లకు హైడ్రా నోటీసులు
ఈ వారం హైడ్రా మూసీ ప్రాంతాల్లో కూల్చివేత్తలు చేపట్టబోతున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది. గోల్నాక, చాదర్ ఘాట్, మూసారంబాగ్ లో ఉన్న ఆక్రమణలను తొలగిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ శని, ఆదివారాలలో మూసీ నది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో ఉన్న ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా.. ఈ క్రమంలో 1350 మందికి తాజాగా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ మూసీ నివాసిత ప్రాంతాలకు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా వారితో చర్చలు జరపనున్నారు.
నేటి నుంచి ఇంటింటి వివరాలు సేకరణ:
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో నిర్వాసితుల వివరాలు సేకరించేందుకు బుధవారం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చజల్ జిల్లా కలెక్టర్లు, అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి వివరాలు సకరిచనున్నారు. తొలి విడతలో భాగంగా మూసీ రివర్ బెడ్ లో ఉని 1600 ఇళ్లను తొలగించబోతున్నారు.