Hydra : నేడు మాదాపూర్ లో కూల్చివేతలకు హైడ్రా సిద్దం
అక్రమ నిర్మాణా(Illegal Structures)ల తొలగింపు(Demolitions)లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా(Hydra )ఆదివారం మాదాపూర్(Madhapur)లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్దమైంది.
దిశ, వెబ్ డెస్క్ : అక్రమ నిర్మాణా(Illegal Structures)ల తొలగింపు(Demolitions)లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా(Hydra )ఆదివారం మాదాపూర్(Madhapur)లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్దమైంది. మదాపూర్ అయ్యప్ప సొసైటీ(Ayyappa Society)లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న 6 అంతస్తుల భవనంపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన హైడ్రా భవనాన్ని కూల్చివేసేందుకు భారీ క్రేన్ లో అక్కడికి చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా బిల్డర్ పట్టించుకోకపోవడంతో కూల్చివేతకు నిర్ణయించారు.
స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనానికి సరైన అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించారు. మరికొద్దిసేపట్లో కూల్చివేతలు ప్రారంభం కానుండగా, పరిసర ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సైతం భారీగా మోహరించారు.