HYDRA: అవినీతి అధికారులపై ‘హైడ్రా’ కేసులు.. ముందస్తు బెయిల్‌కు పిటిషన్లు

ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్ పెట్టింది.

Update: 2024-09-09 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ (HYDRA) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన ప్రభుత్వ అధికారులను కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) గుర్తించారు. ఈ మేరకు ఆయన పలువురు ప్రభుత్వ అధికారులపై ఇటీవలే సైబరాబాద్ (Cyberabad) ఆర్థిక నేరాల విభాగానికి ఆయన ఫిర్యాదు చేశారు. కమిషనర్ రంగానాథ్ ఫిర్యాదు మేరకు చందానగర్, బాచుపల్లి పరిధిలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) కేసులు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించారు. అయితే, తాజాగా కేసుల నమోదుతో ముందస్తు బెయిల్ కోసం ప్రభుత్వ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. అందులో బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్, ల్యాండ్, రికార్డ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఉన్నారు. అయితే, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదంటూ ఈవోడబ్ల్యూ పోలీసులు కోర్టుకు నివేదించారు.  


Similar News