YS Sharmila: గద్దర్ కుటుంబానికి షర్మిల పరామర్శ.. సీఎం కేసీఆర్‌‌కు కీలక డిమాండ్లు

ప్రజా యుద్ధనౌక, కవి, గాయకుడు, దివంగత గద్దర్ కుటుంబాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల పరామర్శించారు...

Update: 2023-08-13 12:43 GMT

శ, వెబ్‌డెస్క్: ప్రజా యుద్ధనౌక, కవి, గాయకుడు, దివంగత గద్దర్ కుటుంబాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. గద్దర్ భార్య విమల, కూతురు వెన్నెలను ఆమె కలిశారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. గద్దర్ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. గద్దర్ పుట్టిన ఊరిలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం గద్దర్ తన జీవితాన్ని అంకితం చేశారని షర్మిల గుర్తు చేశారు.


అయితే సీఎం కేసీఆర్ మాత్రం గద్దర్‌ను అవమానించారని షర్మిల మండిపడ్డారు. చాలా సార్లు అపాయింట్‌మెంట్ కోసం గద్దర్ ప్రయత్నించారని.. కానీ కేసీఆర్ మాత్రం స్పందించలేదని ఆమె విమర్శించారు. సీఎం అపాయింట్‌మెంట్ దొరకపోవడంతో కొన్ని సందర్భాల్లో గద్దర్ కంటతడి పెట్టుకున్నారని చెప్పారు.



గద్దర్ ఉన్నప్పుడు పట్టించుకోలేదు గానీ.. ఆయన చనిపోయిన తర్వాత కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ కుటుంబానికి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News