ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తా : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం డ్రైనేజీ వ్యవస్థ కల్పించే దిశగా పనిచేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు.

Update: 2024-11-20 10:14 GMT

దిశ, చైతన్య పురి : శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం డ్రైనేజీ వ్యవస్థ కల్పించే దిశగా పనిచేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వాటర్ వర్క్స్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే 30 సంవత్సరాల వరకు ప్రజలు ఎవరికి ఇబ్బందులు లేకుండా ట్రంక్ లైన్ నిర్మాణ పనులు అనుసంధానం చేయాలని సూచించారు. ట్రంక్ లైన్స్ నిర్మాణ పనులు చేస్తూ వాటర్ వర్క్స్ సంబంధించిన నిర్మాణాలు కూడా చేయాలని ఆదేశించారు. పనులలో ఎలాంటి అలసత్వం చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డి.జీ.ఏం.రాజ్ గోపాల్, మేనేజర్ వాహిణి పాల్గొన్నారు.


Similar News