ఆసక్తి చూపని ఓటర్లు

గ్రేటర్ హైదరాబాద్‌ లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

Update: 2023-12-01 02:22 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ / సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌ లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైనప్పటికీ మందకొడిగా సాగింది. పాతబస్తీతో సహా ఇతర చాలా నియోజకవర్గాలలో ఓటర్లు లేక పోలింగ్ బూత్‌లు వెలవెలబోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా 20 శాతం పోలింగ్, ఓటింగ్ ముసిగే సమయానికి 45.52 శాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో గురువారం ఒకే రోజు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో నివాసముంటున్న మెజార్టీ ఓటర్లు జిల్లాలకు చెందినవారు కావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టడం కూడా నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి కారణంగా కనబడుతోంది. నగరానికి చెందిన ఓటర్లు కూడా ఓటు వేయకుండా ఇండ్లకే పరిమితం కావడంతో మరోమారు అత్యల్ప ఓటింగ్ నమోదైంది.

ప్రతి ఒక్క రు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ రోజును సెలవు దినంగా ప్రకటించినప్పటికీ నగర ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా సెలవు రోజును ఇండ్లవద్దనే ఎంజాయ్ చేశారు. మొత్తం గ్రేటర్ పరిధిలో 74,12,601 ఓట్లకు గానూ మధ్యాహ్నం 3 గంటల వరకు 22,06,173 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరోవైపు, కనీసం ఎన్నికల అధికారు పోలింగ్ చిటీలు పంచకపోవడంతో పోలింగ్ కేంద్రాలు తెలయక జనం ఇబ్బందులపాలయ్యారు. ఇదిలా ఉండగా పోలీంగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పట్టిష్టమైన చర్యలు తీసుకుంది. చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మొరాయించిన ఈవీఎంలు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం జరిగిన పోలింగ్ ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టినట్లైంది. ఓ వైపు అత్యల్ప ఓటింగ్ నమోదై పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు మందకొడిగా ఉన్నప్పటికీ చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక ఇబ్బందుల పాలయ్యారు. పనిచేసిన చోట్ల కూడా ఈఎవీఎంలో ఓటు నమోదు కావడానికి సుమారు పది సెకన్లకు పైగా సమయం తీసుకోవడంతో ఓటు నమోదైందో లేదో తెలియక తికమకకు గురయ్యారు. దీంతో పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. కొన్ని చోట్ల అధికారులు వేగంగా స్పందించి మొరాయించిన ఈవీఎంలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇతర సెలబ్రిటీలు తమ ఓటు హక్కును ఉదయమే వినియోగించుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు.

నిర్మాణుశ్యంగా మారిన రోడ్లు..

ఎన్నికల సందర్భంగా నగర ప్రజలు గ్రామాల బాట పట్టడంతో హైదరాబాద్ నగర రోడ్లు నిర్మాణుశ్యంగా మారాయి. రోడ్ల పై రద్దీ లేకుండాపోవడంతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో రద్దీగా ఉండే మెట్రో సైతం ప్రయాణీకులు లేక వెలవెలబోయాయి. కనీసం సీటింగ్ కెపాసిటీ లేకుండా మెట్రో రైళ్లు నడువడం పరిస్థితికి అద్దం పడుతోంది.

రాత్రి 10 గంటల వరకు పోలింగ్

సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్‌లో నిల్చున్న ఓటర్లందరికీ ఓటు హక్కును కల్పించారు. పలు నియోజకవర్గాల్లో రాత్రి 9, 10 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగినట్లు సమాచారం. దీంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి, నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం అంచనా వేసిన పోలింగ్ పర్సెంటేజీలు ఇలా ఉన్నాయి.

నియోజకవర్గాల వారీగా పోలింగ్ పర్సంటేజీలు

నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లు ఓటర్లు పోలింగ్ శాతం

ముషీరాబాద్ 274          3,53,833                    40.24

మలక్‌పేట 300             2,44,946                        36.09

అంబర్‌పేట ౨౩౬          3,28,293                   40.69

ఖైరతాబాద్ 245             2,66,909                       45.05

జూబ్లీహిల్స్ 329            2,94,147                      44.02

సనత్‌నగర్ 229             2,56,555                      45.01

నాంపల్లి ౨౨౭              3,75,430                       32.04

కార్వాన్ 311                  3,11,824                            40.49

గోషామహాల్ 235           2,24,065                      45.79

చార్మినార్ 198              2,46,567                        34.02

చాంద్రాయణగుట్ట 305  2,89,558                      39.00

యాకుత్‌పురా 332           2,46,567                    27,87

బహదూర్‌పురా 263         3,21,159                   39.11

సికింద్రాబాద్ 220            3,47,625                      45.01

కంటోన్మెంట్ 232             3,10,819                      47.14

Tags:    

Similar News