శ్రీరామనవమి శోభయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామ నవమి వచ్చేసింది. మార్చి 30న శ్రీరామ నవమి, ఈ పండుగ రోజు హిందువులందరూ సీతారముల కళ్యాణాన్ని ఘనంగా జరుపుతారు. అనంతరం చివర్లో విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్ : శ్రీరామ నవమి వచ్చేసింది. మార్చి 30న శ్రీరామ నవమి, ఈ పండుగ రోజు హిందువులందరూ సీతారముల కళ్యాణాన్ని ఘనంగా జరుపుతారు. అనంతరం చివర్లో విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. కాగా శ్రీరామ నవమి శోభాయత్ర సందర్భంగా రేపు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు.
రేపు ఉదయం ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. మొత్తం ఆరు కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగ నుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు దారి మల్లింపు చర్యలు ఉంటాయని, వాహనదారులు, ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాని సూచించారు. అయితే ముఖ్యంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉండనున్నట్లు వారు తెలిపారు.