మంచినీళ్ల పండుగ ఎవరికోసం.. ఎంసీపీఐయూ నాయకులు..
మంచినీళ్ల పండుగ ఎవరికోసమని ఓంకార్ ప్రజలు నేటికీ త్రాగునీటికి నోచుకోవడం లేదని ఎంసీపీఐయూ నాయకులు మండిపడ్డారు.
దిశ, చందానగర్ : మంచినీళ్ల పండుగ ఎవరికోసమని ఓంకార్ ప్రజలు నేటికీ త్రాగునీటికి నోచుకోవడం లేదని ఎంసీపీఐయూ నాయకులు మండిపడ్డారు. ఎంసీపీఐ నాయకులు మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ఓంకార్ నగర్ లో 800 కుటుంబాలు బడుగు బలహీన అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు నీళ్ల సమస్య తీరలేదన్నారు.
ఇంత ఆధునిక ప్రపంచంలో ఉన్న అనాగరికంగా గుంతలు, ఊట చలిమలు తొవ్వుకొని నీళ్ళు చేదుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచినీళ్ల పండుగ ఎవరికోసం పేదల సమస్యలు తీర్చలేనప్పుడు పండుగలు దేనికి ఈ పండుగలు ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు లాక్కోడానికేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యు) డివిజన్ నాయకులు శివాని రజియా, లలిత బస్తీ వాసులు ఇసాక్, జంగయ్య, కోటయ్య, గాలయ్య, ఎల్లమ్మ, అనిత పాల్గొన్నారు.