Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీశ్ రావు ఏమన్నారంటే..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్‌ను ఏపీ, తెలంగాణలో పలువురు రాజకీయ నేతలు ఖండిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు.
అయితే ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్ల ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అరెస్ట్‌కు నిరసన కూడా తెలపొద్దా అనే ప్రశ్న అన్ని పార్టీల నాయకులు నుంచి వినిపించాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ను కొందరు బీఆర్ఎస్ నేతలు ఖండించినా అది అంతగా పేలలేదు. కానీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం విమర్శల పాలయ్యాయి. ఏపీకి సంబంధించిన విషయం ఇక్కడ ఎందుకు అని మంత్రి కేటీఆర్ అనడంతో అన్ని పార్టీ నేతలు, ప్రజలు, ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది.
మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సామాజికవర్గం నుంచి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అలర్టైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పుడిప్పుడే చంద్రబాబు అరెస్ట్‌ను మీడియా ముఖంగా ఖండిస్తున్నారు. నిన్న, మొన్న వరకు మాట దాట వేసిన నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమన్నారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిదికాదని హరీశ్‌రావు పేర్కొన్నారు.