22 మంది తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు
తెలంగాణకు చెందిన 22 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అవార్డులు దక్కాయి...
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు చెందిన 22 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గ్రుహ మంత్రి దక్షతా పదక్ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 463 మంది పోలీసు సిబ్బందికి అవార్డులు లభించాయి. సీఆర్పీఎఫ్, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సీక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనపర్చిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. తెలంగాణకు చెందిన భాస్కరన్ ఎస్పీతో పాటు పలువురు పోలీసు కానిస్టేబుళ్లకు ఈ పురస్కారాలు దక్కాయి.