నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు తలసాని

నిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజాసేవకే తన రాజకీయ జీవితం అంకితం చేసే నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నగరంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ సనత్ నగర్ ప్రజలను కోరారు.

Update: 2023-11-21 16:31 GMT

దిశ, బేగంపేట : నిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజాసేవకే తన రాజకీయ జీవితం అంకితం చేసే నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నగరంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ సనత్ నగర్ ప్రజలను కోరారు. మంగళవారం రాత్రి సనత్ నగర్ లోని మహంకాళి టెంపుల్, బల్కంపేట దేవాలయం ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బక్క పలుచని కేసీఆర్ ను ఓడించి తెలంగాణ గొంతు పిసికేందుకు ఢిల్లీ నుంచి షేర్లు, శంషేర్లు వస్తున్నారని అన్నారు. కారు ఉండగా ఇలాంటి బేకార్ గాళ్లు మనకెందుకు అంటూ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకపడ్డారు. కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా లేకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులను పిలిపించుకుంటున్నారని, కానీ సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందన్నారు. ఈ పార్టీల నాయకులు సీట్లు, బీఫాంల కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని విమర్శించారు.

    కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవుల కోసం ఇప్పటికే ఆరు మంది సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీకి అధికారం కట్టబెడితే ఆరు నెలలకు ఒక మారు సీఎంలను మారుస్తారని ఆయన ఎద్దేవా చేశారు. 24 గంటల విద్యుత్ ఎక్కడుందని రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన వస్తే ఓల్వో బస్సులో సనత్ నగర్ తీసుకుని వచ్చి కరెంటు తీగలు పట్టిస్తామని, అప్పుడు తెలంగాణకు పట్టిన దరిద్రం పోయి కరెంటు వస్తుందో లేదో తెలుస్తుందన్నారు. మోడీ ఆడపడుచులను ఓట్లడిగి గెలిచిన తర్వాత రూ.800 పెంచాడని పెంచిన డబ్బులను కేసీఆర్ భరిస్తూ రూ.400 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరుతో రూ.9000 అందిస్తామని, తెలుపు రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ ధీమా పేరుతో రూ.5 లక్షల జీవిత బీమా, సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్,

    టీడీపీ హయాంలో ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నాలు జరిగేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటూ ఆయన ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు అందించిన ఘనత తమదేనన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత పనుల గురించి అడుగలేదని, ఏ కొత్త స్కీము మొదలు పెట్టినా తన నియోజకవర్గంలో పెట్టాలని అడుగుతారని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సనత్ నగర్ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి అరుణగౌడ్, శేషు కుమారి కిరణ్మయి, ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News