శిల్పకళా వేదికలో ఘనంగా 'వరల్డ్ టూరిజం డే 2023' వేడుకలు

మాదాపూర్ శిల్పకళా వేదికలో జరుగుతున్న వరల్డ్ టూరిజం డే 2023 వేడుకలను సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారభించారు.

Update: 2023-09-25 10:11 GMT

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పకళా వేదికలో జరుగుతున్న వరల్డ్ టూరిజం డే 2023 వేడుకలను సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారభించారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక శాఖ బాగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ మూడు రోజులు వరల్డ్ టూరిజం డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతినిధుల కోసం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశామన్నారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా ప్రతి చెరువు వద్ద బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ కమీషనర్ శైలజ రామయ్యర్, టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎండీ మనోహర్, డైరెక్టర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు.


Similar News