ప్రజలు రెండు నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు : కాటేపల్లి వెంకటరమణ రెడ్డి

హైదారాబాద్ లోని పేద, మధ్య తరగతి ప్రజలు రెండు నెలలుగా

Update: 2024-10-09 16:26 GMT

దిశ, ఖైరతాబాద్ : హైదారాబాద్ లోని పేద, మధ్య తరగతి ప్రజలు రెండు నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఇళ్లు ఉంటుందా పోతుందా అనే భయంతో భోజనం కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు అని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని గతంలో కోరానని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఆరోపణలు చేస్తోంది ఈ రెండు పార్టీలకు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం లేనట్లు ఉంది అన్నారు.

చెరువులను కబ్జా చేశారని చెబుతున్నారో తప్పితే ఎవరూ చేశారో చెప్పడం లేదు అన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎవరూ కబ్జా చేశారు చెప్పాలన్నారు. ప్రేమవతి పేటలో పెద్ద చెరువు 98ఎకరాల్లో ఉంది. దీనిని కబ్జా చేసి గేటెడ్ కమ్యూనిటీ కట్టారు , గెటెడ్ కమ్యూనిటీ నిర్మాణానికి ఎట్లా అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు. ఉస్మాన్ కుంట పేరును కూడా మార్చారు. ఉస్మాన్ కుంటను ప్రణీత్ ప్రణవ్ గ్రూవ్ పార్క్ గా మార్చారు ఉస్మాన్ కుంట చుట్టూ విల్లాలు కట్టారు , తెల్లాపూర్ చెరువు మ్యాప్ లన్నీ మాయమయ్యాయి సర్వే పేరుతో మీటర్లు పెట్టగానే డబ్బులు వస్తున్నాయి.అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని వారి ఆస్తులు జప్తు చేయాలని అప్పుడే ముఖ్యమంత్రి పేదల నాయకుడివి అవతవని సవాల్ చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టే అధికారం ఎవరూ ఇచ్చారు అన్నారు.

ఫీనిక్స్, ప్రణీత్ ప్రణవ్ గ్రూవ్, రాంకీ, సైబర్ సిటీ, వాసవి, రాజ్ పుష్ప, జయ భేరి, మైహోమ్స్, అపర్ణ చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలిస్తే ప్రజా పాలన అంటారు ప్రజా పాలన.. పైసల పాలనా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అన్నారు. వరద కాలువల రూట్ మ్యాప్ మొదట చేయాలి , పేదోడి ఇళ్లను కులుస్తున్నావు.. రాజకీయ నాయకులు, కంపెనీల అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదు.2లక్షల 75వేల చొప్పున నెలకు నాకు జీతం వస్తుంది. నేను తీసుకున్న నా పది నెలల జీతాన్ని తిరిగి ఇస్తా..119మంది ఎమ్మెల్యేలు, 17మంది ఎంపీలు, ఎమ్మెల్సీల జీతం తీసుకోకుండా పేదలకు ఇళ్లను నిర్మిద్దాం.పేదలకు ఇళ్లను నిర్మించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధమా అన్నారు.


Similar News