రెరాకు 56 మంది ఉద్యోగులు.. మంజూరు చేసిన ఆర్థిక శాఖ
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఆథారిటీకి 56 మంది ఉద్యోగులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమర్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు..
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ ఆథారిటీ(టీజీ రెరా)కు 56 మంది ఉద్యోగులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమర్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో 39 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 17 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మంజూరు చేస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కార్యదర్శి, అడ్జుకేటింగ్ ఆఫీసర్, రిజిష్ట్రర్, జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్, ఫైనాన్స్ ఆఫీసర్, ఆర్డీఓ, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 3, తహశీల్దార్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, కోర్టు ఆఫీసర్ పోస్టులు 4, కోర్టు మాస్టర్/సీనియర్ స్టేనోగ్రాఫర్ పోస్టులు 4, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 2, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 4, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 11, పర్సనల్ అసిస్టెంట్ టు చైర్మెన్ ఒకటి చొప్పున పోస్టులను మంజూరు చేశారు. 17 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో నలుగురు లీగల్ ఎగ్జిక్యూటీవ్స్, హెల్ప్ డెస్క్ అసిస్టెంట్లు(టెక్నికల్) నలుగురు, పీఏ కం కంప్యూటర్ ఆపరేటర్లు ముగ్గురు, డేటీ ఎంట్రీ ఆపరేటర్లు ఇద్దరు, చార్టెడ్ అకౌంట్ కన్సల్టెంట్, ఐటీ బిజినెస్ అనలిస్టు, లీగల్ అడ్వైజర్, పీఏ కం యూడీ స్టేనోగ్రాఫర్ టు పీఏ ఒక్కొటి చొప్పున పోస్టులను మంజూరు చేశారు.