ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సాక సమర్పణ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అధికారులు, వేదపండితులు సాకను సమర్పించారు.
దిశ,బేగంపేట : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అధికారులు, వేదపండితులు సాకను సమర్పించారు. గత ఆషాఢ బోనాల జాతరలో భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పిన విధంగా శుక్రవారం సాకను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కోట నీలిమ, ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ధర్మకర్తలు, మాజీ ఫెస్టివల్ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.