వాహనాల తనిఖీల్లో రూ. 1.30 కోట్లు స్వాధీనం

వాహనాల తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఎటువంటి ఆధారాలు లేని ఒక కోటి 30 లక్షల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2025-03-25 15:05 GMT
వాహనాల తనిఖీల్లో రూ. 1.30 కోట్లు స్వాధీనం
  • whatsapp icon

దిశ, చార్మినార్ : వాహనాల తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఎటువంటి ఆధారాలు లేని ఒక కోటి 30 లక్షల నగదును చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీ ఫుల్ బాగ్ జంక్షన్ వద్ద చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొహమ్మద్ యూసుఫ్ ఉద్దీన్, సయ్యద్ అబ్దుల్ హంది వెళ్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో ఒక కోటి 30 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు పోలీసులకు చూపించక పోవడం తో రూ. 1.30 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News