జైలు నుంచి విడుదలైన 25 రోజులకే... మళ్లీ పోలీసులకు చిక్కిన రొమి

జైలు నుంచి విడుదలైన 25 రోజులకే మరోసారి రాచకొండ పోలీసులకు గంజాయితో ఓ వ్యక్తి దొరికిపోయాడు

Update: 2024-10-04 13:55 GMT

దిశ, సిటీక్రైం : జైలు నుంచి విడుదలైన 25 రోజులకే మరోసారి రాచకొండ పోలీసులకు గంజాయితో ఓ వ్యక్తి దొరికిపోయాడు. అతని నుంచి కేజీన్నర గంజాయి, 50 గ్రాముల ఓజీ ని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ముంబాయికి చెందిన రుమి భరత్ గోవాలో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ గంజాయి దందాను చేస్తున్నాడు. గురువారం సాయంత్రం బస్సులో వచ్చిన రొమి భరత్ బెంగుళూరు వద్ద దిగి ఆటో లో తుక్కుగూడ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు అతనిని తనిఖీ చేశారు. అతని బ్యాగులో కేజీన్నర గంజాయి, 50 గ్రాముల ఓజీ మత్తు పదార్థం లభించింది. అతనిని అరెస్టు చేసిన రాచకొండ ఎస్ ఓటీ పోలీసులు తదుపరి విచారణ కోసం రొమి భరత్ ను ఆదిబట్ల పోలీసులకు అప్పగించారు.

రొమి-టోబి గంజాయి కహాని--

రొమి భరత్ తన 10 వ తరగతి ముంబాయిలో, ఇంటర్మీడియట్ థాయ్ ల్యాండ్, డిగ్రీ ని అమెరికాలో, పీజీ ని దుబాయ్ లో చేసి ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కేరళకు చెందిన టోబి పరిచయం అయ్యాడు. అతను గంజాయి దందా గురించి చెప్పడంతో రొమి భరత్ అప్పటి నుంచి టోబి నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగొలు చేసి హైదరాబాద్ తో పాటు పూణే, ముంబాయి, గోవా ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. రొమి 2004 లో ముంబాయి బాంద్రా పీఎస్, 2023 గోవా అన్జునా పీఎస్, 2024 హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు దొరికాడు. ఇటీవల ఆగస్టు నెలలో చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన రొమి భరత్ తిరిగి గోవా, బెంగళూరు, పూణే, కేరళ కు వెళ్ళి గంజాయిని నగరానికి తీసుకువస్తూ గురువారం సాయంత్రం పోలీసులకు దొరకడంతో అతని అరెస్టును పోలీసులు శుక్రవారం ప్రకటించారు.


Similar News