మొబైల్ ఫోన్‌ల రికవరీ..తెలంగాణ పోలీసులకు దేశంలో 2వ స్థానం..
తెలంగాణ పోలీసులు చోరీకి గురైన , మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్
దిశ, సిటీ క్రైమ్ : తెలంగాణ పోలీసులు చోరీకి గురైన , మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్ లో రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని డీజీపీ జితేంద్ర మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ ల (Mobile phone) రికవరీ కోసం పని చేసిన 11 మంది పోలీసు ఆఫీసర్స్, 10 పోలీసు స్టేషన్ సిబ్బందిని అభినందించి వారికి ప్రశంస పత్రాలను అందించారు. సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా నమోదు చేసుకున్న ఫిర్యాదులపై ఐఎంఈఐ నెంబర్ల ద్వారా ట్రాకింగ్ చేసి ఏప్రీల్ 2023 నుంచి నవంబర్ (November) 3వ తేదీ వరకు తెలంగాణలోని 780 పోలీసు స్టేషన్ ల పరిధిలో మొత్తం 50788 మొబైల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేశారు. రోజుకు 91 మొబైల్ ఫోన్ ల చొప్పున 557 రోజులలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ లు చోరీకి గురైన, మిస్సింగ్ అయినా వెంటనే సీఈఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని డీజీపీ (DGP) సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న నేరాలు, పోలీసుల పనితీరు పై ప్రతి నెల జరిగే సమీక్షను జరిపిన డీజీపీ నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ డీజీ షికా గోయెల్ పాల్గొన్నారు.