నిజాంపేట శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స..

నిజాంపేట శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు ఓ వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

Update: 2023-05-30 17:22 GMT

దిశ, శేరిలింగంపల్లి : నిజాంపేట శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యులు ఓ వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలోకి వెళ్తే కల్వకుర్తికి చెందిన మల్లయ్య (47) అనే వ్యక్తికి కడుపులో పదేపదే నొప్పి రావడంతో నిజాంపేట శ్రీ శ్రీ హోలిస్టిక్ డాక్టర్లను సంప్రదించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు కడుపులో 30 కిలోలకు పైగా బరువుగల కణతి ఉన్నట్లు గుర్తించారు. రోగి కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా వారు బాధితుడి ప్రాణాలు కాపాడాలని అభ్యర్థించారు.

దీంతో వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసిన డాక్టర్లు సుమారు నాలుగు గంటలకు పైగా శ్రమించి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి కణతిని విజయవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ల బృందంలోని సీనియర్ డాక్టర్లు రాంప్రసాద్, యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ సరైన టైంలో కణితిని గుర్తించి తొలగించడం ద్వారా క్యాన్సర్మహమ్మారి నుండి కాపాడగలిగామని, అలాగే చికిత్స తర్వాత పేషెంట్ పూర్తిస్థాయి ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్ల బృందం తెలిపింది. సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు రోగి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News