BREAKING: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం స్టార్ట్.. GHMC కీలక సూచన

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్,

Update: 2024-05-19 10:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, బోయిన్ పల్లి, మారేడు పల్లి, జవహర్ నగర్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, పేట్ బషీరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ఆదివారం వీకెండ్ కావడంతో సరదగా ఫ్యామిలీతో గడుపుదామని బయటకు వచ్చిన నగరవాసులు వర్షం కురవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా వరద నీరు రోడ్ల మీదకు చేరడంతో పలు చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తోన్న నేపథ్యంలో అవసరమైతేనే బయటకు రావాలని నగరవాసులకు అధికారులు సూచించారు. 


Similar News