హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక సూచన..!

రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్‌లో ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని రాజేంద్రనగర్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి,

Update: 2024-06-23 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్‌లో ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని రాజేంద్రనగర్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఎల్బీనగర్‌ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రంగంలోకి జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ఆదివారం వీకెండ్‌లో చిల్లా అవుదామని బయటకు వచ్చిన నగరవాసులు వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు పలుచోట్ల రోడ్లపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కురుస్తోన్న నేపథ్యంలో నగరవాసులకు అధికారులు కీలక సూచన చేశారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని సూచించారు.


Similar News