తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ. 5,071 కోట్లు: రైల్వే మంత్రి
భారతీయ రైల్వేలకు 2024-25 సంవత్సరానికిగాను రూ. 2,52,000 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు....
దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వేలకు 2024-25 సంవత్సరానికిగాను రూ. 2,52,000 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన బడ్జెట్‌పై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌తో పాటు సీనియర్ రైల్వే అధికారులతో ఆయన వర్చువల్ మాట్లాడారు. రైల్వేలో సామర్థ్యాన్ని పెంచేందుకు 3 ముఖ్యమైన ఎకనామిక్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులను అమలు చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. వచ్చే 6 నుంచి 8 సంవత్సరాల వ్యవధిలో 40 వేల కి.మీ ట్రాక్ నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ మొత్తంలో 2024-25 సంవత్సరానికిగాను రూ. 5,071 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
తెలంగాణలో 2009-14లో ఏటా 70 కిలోమీటర్ల ట్రాక్ మాత్రమే వేయడం జరిగిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. . కాని ప్రస్తుతం ప్రతి సంవత్సరం 142 కిలోమీటర్ల రైల్‌ట్రాక్‌ను తెలంగాణలో వేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో 414 ఆర్ ఓబీలు & ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నామని, అంతేకాకుండా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో 45 వన్‌స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్ ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Read More..
అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం