హైదరాబాద్‌లోని పబ్‌లపై నార్కొటిక్ బ్యూరో మెరుపు దాడులు.. రంగంలోకి స్నిఫర్ డాగ్స్..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని పలు పబ్‌లలో

Update: 2024-06-30 15:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ నగరంలోని పలు పబ్‌లలో నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్‌ను గుర్తించే ట్రైయిన్డ్ స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పబ్‌లలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంతో పాటు ఇవాళ ఆదివారం వీకెండ్ కావడంతో ప్లాన్ ప్రకారం నార్కొటిక్ బ్యూరో అధికారులు సోదాలు చేపట్టారు. కాగా, హైదరాబాద్‌లో ఇటీవల డ్రగ్స్, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయి నగరంలో క్రైట్ రేట్ ఎక్కువ అయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో ఇటీవల వరసగా చోటు చేసుకుంటున్న హత్యలు, అత్యాచార ఘటనలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో మత్తు పదార్థాల వినియోగంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు నగరంలో ఎక్కడికక్కడ మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పబ్‌లపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.


Similar News