ganja : మియాపూర్ లో భారీగా గంజాయి పట్టివేత...
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి, మాదకద్రవ్యాల రవాణా మాత్రం ఆగడం లేదు.
దిశ, శేరిలింగంపల్లి : పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి, మాదకద్రవ్యాల రవాణా మాత్రం ఆగడం లేదు. నగరంలో ప్రతి రోజు ఎక్కడో అక్కడ గంజాయి, మాదకద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం ఉదయం బుమియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డులో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి మియాపూర్ మీదుగా గంజాయిని తరలిస్తున్నారన్నా పక్కా సమాచారంతో ఎస్ ఓటీ పోలీసులు నిఘా ఉంచారు.
మహీంద్రా కారులో దాదాపుగా 21 కిలోల గంజాయిని ఒరిసా నుండి హైదరాబాద్ కి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు గల ముఠాను మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న మాదాపూర్ ఎస్ ఓటీ పోలీసులు ఒడిస్సాకు చెందిన కీలక నిందితుడితో పాటు అతని ఇద్దరు అనుచరులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులతో పాటు సీజ్ చేసిన గంజాయిని ఎస్ ఓటీ పోలీసులు మియాపూర్ పోలీసులకు అప్పగించారు.