'ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చూడండి'.. మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం

తెలంగాణలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కోరారు.

Update: 2023-09-25 12:39 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కోరారు. ఈ మేరకు సోమవారం మంత్రి హరీష్ రావును గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తో కలిసిన ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది పేదలు ఉన్నారని, అటువంటి వారిని ఆదుకునేందుకు గాను వారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల భూమిని కూడా ఇచ్చారని, ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్భా చంద్ర శేఖర్, కోశాధికారి కొడిప్యాక నారాయణ, కటకం శ్రీనివాస్, ఐ వీ ఎఫ్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కట్టా రవి, హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అయిత నాగరాజు, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నంగునూరి సత్యనారాయణ, గోలి సంతోష్, సిద్ది బిక్షపతి, ఎన్ సీ సంతోష్, కైలాస ప్రభాకర్, అంతునూరి శివకుమార్, ఉత్తునూరి సంపత్, నరేష్, వివిధ జిల్లాల ఐ వీ ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


Similar News