Governor : చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలి

చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnudev Verma)అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.

Update: 2024-10-27 15:27 GMT

దిశ, ముషీరాబాద్: చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnudev Verma)అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం దేశభక్తి బృందగాన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మGovernor Jishnudev verma)మాట్లాడుతూ.. వ్యక్తి నిర్మాణం తోనే దేశ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలని సూచించారు. దేశభక్తిని క్రమశిక్షణను పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమైనదన్నారు. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

భారతదేశ సంస్కృతి, జీవన విధానం, కుటుంబ వ్యవస్థ గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలని అన్నారు. జాతీయ భావం కలిగిన పౌరులుగా యువతను తీర్చిదిద్దడం లో భారత్ వికాస్ పరిషత్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైందన్నారు. భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ గౌడ్, కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశభక్తి బృందగాన పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ సౌత్ భారత్ రీజనల్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శాస్త్రి, సంయుక్త కార్యదర్శి నరేంద్ర కృష్ణ, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, నాగేందర్, రాజలింగం, సత్యనారాయణ, అంబిక తదితరులు పాల్గొన్నారు.


Similar News