Collector Anudeep Durishetti.. అబిడ్స్ లో భవిత సెంటర్ ప్రారంభం...
విద్యార్థుల ఉన్నత చదువుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.
దిశ, కార్వాన్ : విద్యార్థుల ఉన్నత చదువుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. సోమవారం అబిడ్స్ అలియా స్కూల్ లో చదువుతున్న 429 విద్యార్థుల కోసం భవిత సెంటర్ సీఎస్ఆర్ బొచ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవిత సెంటర్ ను ప్రారంభించారు. అంతే కాకుండా ఈ సంస్థ నిర్మించిన 8 కొత్త వాష్‌రూమ్‌లు, 8 కొత్త ర్యాంప్‌లు, రెయిలింగ్‌లతో పాటు 15 వాష్‌రూమ్‌లు, 5 ర్యాంప్‌లు రెయిలింగ్‌ల మరమ్మత్తులు చేసి విద్యార్థులకు లెర్నింగ్ మెటీరియల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే రాజాసింగ్, గన్ ఫౌండ్రి కార్పొరేట్ సురేఖ ఓం ప్రకాష్, డీఈఓ రోహిణి, అర్చన, డైరెక్టర్ శిల్ప పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎస్ఆర్ బోచ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న అభివృద్ధి పనులకు అభినందించారు. ప్రభుత్వం పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం వల్ల ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. విద్యార్థుల చదువుకు తల్లితండ్రుల ప్రోత్సాహం ఉండాలన్నారు.