దారి దోపిడీకి పాల్పడ్డ పాత నేరస్థులు అరెస్ట్
దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు పాత నేరస్తులను కుల్సుంపుర పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 2 సెల్ ఫోన్లు,1 నకల్ పంచ్,1 గన్, 2 కత్తులు, 2 బైకులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.
దిశ,కార్వాన్ : దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు పాత నేరస్తులను కుల్సుంపుర పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 2 సెల్ ఫోన్లు,1 నకల్ పంచ్,1 గన్, 2 కత్తులు, 2 బైకులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ శనివారం వివరాల ప్రకటన విడుదల చేశారు. గుడి మల్కాపూర్ నివాసి ఆర్.కృష్ణ(33) లేబర్. కాగా కృష్ణ ఈ నెల 24న సాయంత్రం 4:30 సమయంలో పని నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు.
పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు వద్ద కు చేరుకోగానే సయ్యద్ అబుల్ హసన్(32,) సయ్యద్ తలేబ్ అలీ(23),సైఫ్ అలీ మీర్జా (19)అడ్డుకొని మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం మొబైల్, బైక్ ను లాక్కొని ముగ్గురు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కులుసుంపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 2 ద్విచక్రవాహనాలు, రెండు రౌండ్లు కలిగిన 1 పిస్తోలు, 2 కత్తులు,1 నకల్ పంచ్ తోపాటు 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని శనివారం రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కాగా సయ్యద్ అబుల్ హసన్, సయ్యద్ తలేబ్ అలీ పై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.