Hyderabad: హైదరాబాద్‌లోని 25 పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు

హైదరాబాద్‌లోని పబ్‌లపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిచారు.

Update: 2024-08-31 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పబ్‌లపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిచారు. టీజీ నాబ్,- ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు చేపట్టారు. నగరంలోని 25 ప్రముఖ పబ్‌లలో ప్రత్యేక బృందాలతో సోదాలు జరిపారు. డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన అధికారులు.. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇటీవల హైదరాబాద్ పబ్‎ల్లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, స్మగ్లింగ్ పై ఉక్కపాదం మోపాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఎక్కిడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. డ్రగ్స్ ను గుర్తించే స్పెషల్ స్నిఫర్ డాగ్స్ ను సైతం రంగంలోకి దింపి ఆకస్మిక రైడ్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి నగరంలోని పలు పబ్ ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఇటీవలే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో 25 పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ పరిధిలో 12, రంగారెడ్డి జిల్లాలో 13 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషీ ఆదేశాలతో.. అసిస్టెంట్‌ కమిషనర్లు ఆర్‌.కిషన్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌ నేతృత్వంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.


Similar News