ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నిందితుడిపై ముంబైలోనూ కేసులు : సీపీ ఆనంద్

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు(Mutyalamma statue destruction case)లో నిందితుడు మహారాష్ట్రలోని ముంబయి సమీపంలోని ముంబ్రాకు చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ మతోన్మాదిగా మారాడని, అతనిపై ముంబైలోనూ కేసులున్నాయని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్(CP CV.Anand) తెలిపారు.

Update: 2024-10-25 11:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు(Mutyalamma statue destruction case)లో నిందితుడు మహారాష్ట్రలోని ముంబయి సమీపంలోని ముంబ్రాకు చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ మతోన్మాదిగా మారాడని, అతనిపై ముంబైలోనూ కేసులున్నాయని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్(CP CV.Anand) తెలిపారు. ముంబైలో ఉన్నపుడు ఇలానే చేసాడని, నిందితుడుపై ముంబైలో రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిందితుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడని, ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ సహా పలువురి ప్రసంగాలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వింటూ విగ్రహారాధనపై ద్వేషాన్ని పెంచుకున్నాడని వెల్లడించారు. ఉద్యోగం చేసే కార్యాలయంలోనూ మత వివాదం పెట్టుకున్నాడన్నారు. ముంబై పోలీసులతో కలిసి విచారణ చేస్తున్నామని తెలిపారు.

‘సల్మాన్ పై 2022 సెప్టెంబరు 6న ముంబయిలో గణేశ్ మండపంలోకి చెప్పులు వేసుకుని వెళ్లి పూజలను అపహాస్యం చేస్తూ స్థానికులతో వాదనకు దిగిన కేసు, 2024 ఆగస్టు 1న మీరా రోడ్డులోని ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితుడిపై ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 14న 234/2024 కింద ఎఫ్ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు.

Tags:    

Similar News